ఎస్‌ఐఆర్‌లో ప్రతి ఓటరు బాధ్యతగా నమోదు చేసుకోవాలి

  • గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల, ఆంధ్రప్రభ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను బీఎల్‌ఓలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో బీఎల్‌ఓ అందించిన ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ పత్రాలను గురువారం ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్‌ఓలకు తెలియజేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, టీయూవీ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, పోలగోని స్వామి, పాకాల దినేష్, రూపని యాదయ్య తదితరులు పాల్గొన్నారు.