సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం దూదిగాం, చాకిర్యాల్, సావెల్ గ్రామాల్లో సిఎంఆర్ఎఫ్ చెక్కుల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడాల సాయరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులకు కలిసి శుక్రవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడాల సాయరెడ్డి మాట్లాడుతూ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని,లక్ష 80 వేల రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు,ఉపసర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
