నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి…

తొర్రూరు, ఆంధ్రప్రభ : నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న బ్రదర్స్ జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డి లు అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి రామ నరసమ్మ, మూల నాగమ్మలు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున 50 కేజీల బియ్యం,రూ 3 వేల చొప్పున రూ.6 వేల నగదును అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డి సహకారంతో నిరుపేద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేపతకాలు సకాలంలో అదే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు జక్కుల రామ్ రెడ్డి, జిల్లాయువజన నాయకులు బసనబోయిన రాజేష్ యాదవ్,తొర్రూరు పట్టణ యూత్ అధ్యక్షులు బసనబోయిన మహేష్ యాదవ్, తంగళ్ళపల్లి అశోక్,యర్రం రాజు యాదవ్,మాజీ సర్పంచ్ జీలకర నాగభూషణం, మాజీ ఉప సర్పంచ్ కుంట జయసుధ రవి, వార్డు సభ్యులు కాటం వెంకట్ రెడ్డి, ఎడ్ల నవీన్ రెడ్డి,వడ్లకొండ యాకయ్య,మాదారపు ప్రకాష్,షేక్ అజీమ్,ఎడ్ల నితీష్,మహేందర్, బొమ్మనబోయిన అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.