అదనపు ఎస్పీని కలిసిన బీఆర్ఎస్వీ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇటీవ‌ల బాధ్య‌త‌లు తీసుకున్న‌ సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిని బీఆర్ఎస్వీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్ర‌వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బీఆర్ఎస్వీ నాయకులు అఖిల్, గౌతమ్, దిలీప్‌లు క‌లిసి అద‌న‌పు ఎస్పీకి పూల మొక్క‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలికారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Leave a Reply