చేగుంటలో ఆటో డ్రైవర్ అదృశ్యం..

చేగుంట, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా, చేగుంట మండలం, దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన పాములపర్తి స్వామి (45) అనే ఆటో డ్రైవర్ అదృశ్యమైనట్లు చేగుంట పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మున్నూరుకాపు కులానికి చెందిన స్వామి ఈ నెల 11వ తేదీన (గురువారం) చేగుంటకు వచ్చాడు. ఇక్కడి తన బంధువుల ఇంటి వద్ద ఆటోను నిలిపి ఉంచి, ఆ తర్వాత ఎటో వెళ్లిపోయాడు.​మరుసటి రోజు వరకు కూడా ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన భార్య పాములపర్తి రజిత చేగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, స్వామి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు.