కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..?

కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..?
ఫోటోలు దిగారు తప్ప, పని పూర్తి చేయలేదు
హంగులు ఆర్భాటాలకేనా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులు..?
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో సోమవారం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్తను ఎత్తుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అయితే ఎత్తిన చెత్తను అక్కడి నుంచే తరలించకుండా అలాగే వదిలివేయడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో చెత్త అక్కడే పేరుకుపోయిందని ఆరోపిస్తున్నారు. కార్యక్రమం పేరుతో హంగులు, ఆర్భాటాలు మాత్రమే చేసి అసలు పని పూర్తిగా చేయలేదని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శానిటేషన్ పనులు పూర్తి చేస్తారో లేక ఆర్బాటలతోనే సరిపెట్టుకుంటారో వేచి చూడాలి.

