BONDA | పేదల వైద్యాన్ని ఖరీదు చేసింది వైసీపీనే..
BONDA | పేదల వైద్యాన్ని ఖరీదు చేసింది వైసీపీనే..
- కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసింది కూడా వైసిపి నే…
- పేదలకు ఆర్థికంగా ఒక్క రూపాయి అన్న ఆదుకున్నారా..
- నేడు ఆపన్నలకు అండగా సీఎంఆర్ఎఫ్…
- ఆసుపత్రులన్నీ అభివృద్ధి చేస్తున్నాం..
- ఆరోగ్యకరమైన వైద్యాన్ని అందిస్తున్నాం..
BONDA | పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలందరికీ వైద్యాన్ని దూరం చేసింది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా పేదల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేదు అన్న ఆయన, ఇప్పటి కూటమీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ నిధులు అందించడంతో పాటు ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆపన్నులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి 6 మందికి రూ.₹6 లక్షల 11వేల రూపాయలు ఆర్థిక సహాయాన్నివిప్ బోండా ఉమామహేశ్వరరావు ఆదివారం సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పెద్ద ఎత్తున విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ…జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాలతో వైద్యం పేదలకు అందని ద్రాక్షలాగా మారిందని, ప్రభుత్వ వైద్యం పేదలకు దూరం చేయడంతో పాటు ప్రైవేటు కార్పొరేట్ వైద్యాన్ని అతి ఖరీదైన వైద్యంగా తయారు చేయడమే కాకుండా.. సామాన్యులకు పేదలకు ప్రైవేటు వైద్యం అందుబాటులో లేకుండా భారీగా ఖరీదైన వైద్యంగా తయారు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కీలకపాత్ర వహించిందని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు ప్రభుత్వ వైద్యశాలలు డివిజన్ పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలు అనేక రకాలైన వైద్యాలకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను ఇచ్చి వారి ఆరోగ్య బాగోవులను చూసుకున్న ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అని తాను ఆనాడు ఎమ్మెల్యే గా ఉండి సెంట్రల్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేపించుకున్న వేలాది మందికి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి గా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునాతనమైన పరికరాలతో మంచి వైద్యం అందించడమే కాకుండా డివిజన్ల స్థాయిలో ఉన్న 14 ప్రాథమిక వైద్యశాలలలో ఉన్నతమైన డాక్టర్లను నియమించి పూర్తి స్టాఫ్ ను ఏర్పాటు చేసి ఉచితంగా ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు ఇస్తూ ప్రాథమిక వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామని, అదేవిధంగా కార్పొరేట్ వైద్యశాలలలో, ప్రైవేటు వైద్యశాలలలో, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలలో అనారోగ్యానికి గురై వైద్యం చేపించుకొన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో అప్లై చేసుకున్న వారందరికీ సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో చెక్కులను ఇస్తూ వారిని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకుంటూ ఉన్నాం అన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను, కార్పొరేషన్ పరంగా ఉన్న వైద్యశాలలను అభివృద్ధి చేసి అందరికీ ఆరోగ్యకరమైన మంచి వైద్యాన్ని అందించెందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
