అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా దర్బార్
అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా దర్బార్
ప్రజల సమస్యలపై ప్రత్యేక పర్యవేక్షణ
ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్‌కు విశేష స్పందన
పాయకాపురం, (ఆంధ్రప్రభ): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు సమర్పించారు. వచ్చిన ప్రతి అర్జీపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
“ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం” అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో కార్యాలయ ఇంచార్జి ఘంటా కృష్ణమోహన్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు సెక్రటరీ ఎస్.కె. గౌసియా తదితరులు పాల్గొన్నారు.
