కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు..

కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు..

61వ డివిజన్ శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పేరం కృష్ణమూర్తి…

పాయకాపురం, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వ హయాంలో పెనుగొండకు వాసవి పెనుగొండ జిల్లాగా నామకరణం చేయడం, వాసవి ఆర్యవైశ్య చైర్మన్ గా డూండి రాకేష్ను నియమించడం, రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆర్యవైశ్య పెద్దలు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మించడం, వాసవిఅమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించడం అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్థానిక 61వ డివిజన్ శ్రీవాసవి ఆర్యవైశ్య సేవాసంఘం అధ్యక్షుడు పేరం కృష్ణమూర్తి పేర్కొన్నారు.

డివిజన్ ప్రాంతంలో శాంతి నగర్ ప్రాంతంలో వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్యసంఘం, యువజన, మహిళా సంఘం కమిటీ సభ్యులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తి కీర్తనలు పాడి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు యన్ రాజారావు, కోశాధికారి ఉడత బాల వెంకట శివ నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గుంటూరు వెంకట అప్పారావు, జాయింట్ సెక్రటరీ కొర్రప్రోలు వీరాంజనేయులు, యువజన, మహిళా సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.