భారీగా ఎండు గంజాయి పట్టువేత..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని సంతోష్‌నగర్‌ తండా సమీపంలో శుక్రవారం ఎక్సైజ్‌ ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 100 గ్రాముల ఎండు గంజాయి,ఒక మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి.వేణు మాధవరావు తెలిపారు. గంజాయి సేవించే మరో ముగ్గురు వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, ఎక్సైజ్ అధికారుల ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply