29న ఉట్నూరులో ఓమౌజయాః శ్రీ గురు పూర్ణిమ మహోత్సవం

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి.. పోస్టర్లు విడుదల

ఉట్నూర్, ఆంధ్రప్రభ: శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య మహా ప్రేమావతార మూలాధి పరా స్వయంభూః మహత్తు పరబ్రహ్మ శ్రీ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహ మహిమాన్విత సన్నిధానంలో ఈ నెల 29న బుధవారం ఉట్నూర్‌లోని హెచ్‌కేజీఎన్ గార్డెన్స్‌లో ఓమౌజయాః శ్రీ గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ అధికారి గహన తెలిపారు.

ఈ సందర్భంగా మహోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఓమౌజయాః ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో ప్రేమమయా మహాగురూజీ వారి ఆజ్ఞ మేరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓమౌజయాః స్వయంభూః చైతన్య శక్తిపీఠం శోభాయాత్ర నిర్వహించనున్నారు.

సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీ ప్రభు పల్లకి సేవ, సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు మహాపంచముఖ మహా గాయత్రి గురు ఖడ్గ యజ్ఞం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీధర్మ పరిచయ వేదిక, భక్తి గీతాల ఆవిష్కరణ, ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

యజ్ఞానంతరం భక్తులకు దివ్య ప్రసాదంతో పాటు ఉచిత అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.