పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పోలవరం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద నుంచి నిర్మాణ పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (పవర్ హౌస్)తో పాటు ఇతర నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ల ద్వారా ప్రాజెక్టు పురోగతిని మంత్రి నిమ్మల రామానాయుడు, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు వివరించారు.

ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.

ఈ పర్యటనలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ & ఎక్స్‌అఫీషియో జాయింట్ కలెక్టర్ వి. అభిషేక్, పోలవరం ఇరిగేషన్ ఎస్‌ఈ ఆర్. రామచంద్రరావు, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏలూరు యూడీఏ చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.