మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి
మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి
- జయంతి ఉత్సవ సమితి అధ్యక్షులు రామచందర్
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఏప్రిల్ మాసంలో నిర్వహించనున్న బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జయంతి ఉత్సవ సమితి అధ్యక్షుడు రామచందర్ పిలుపునిచ్చారు.
శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఉత్సవ సమితి సభ్యులు రవి, నరసింహులు, జగదీష్, పుష్ప, బి. కృష్ణయ్య, మహిపాల్, గీత, శంకర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14న రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి జరుగనున్నట్లు తెలిపారు.
ఈ జయంతి ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
