సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులైనా కొత్తపల్లి దేవాయికి రూ.32,000, కొంటికంటి లక్ష్మీకి రూ.53,000, కొమ్ముల రాజ్ కుమార్ కు రూ.13,500 చెక్కులను లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరీకి కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నల్ల సాయికుమార్ గుప్తా, సంపంగి నాగరాజు, వేములవాడ జగదీష్, అబ్దుల్ అజహరోద్దీన్, సల్లూరి గణేష్, గంగాధర్, నరేందర్, శివసారం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply