బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ లేక అవస్థలు….

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జనన, మరణ ధృవపత్రాలు, పన్నుల చెల్లింపులు, ఇతర పంచాయతీ సంబంధిత పనులు సకాలంలో జరగక ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

గ్రామ ప్రజల పనులు రోజుల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్ కందికట్ల రామచందర్ జిల్లా పంచాయతీ అధికారికి (డిపిఓ) పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ నియామకాలు చేపట్టి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply