సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాచావార్

సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాచావార్

డోంగ్లి, ఆంధ్రప్రభ: డోంగ్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా మదన్ హిప్పర్గ సర్పంచ్ లక్ష్మణ్ బచావార్ ను మండల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు డోంగీ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి తెలిపారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, డిసిసి వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు యూనుస్ పటేల్, సంగ్రామ్ పటేల్, శ్రీకాంత్, బస్వరాజ్, దత్తు, మాజీ ఎంపిటిసి దీన్ దయాల్ నాయకులు ఉమాకాంత్ పటేల్, విలాస్ పటేల్,శివ రెడ్డి, విలాస్ గైక్వాడ్,అప్సర్ పటేల్, సుభాష్ పటేల్ కుర్లా,ధనంజయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.