- ఫైనల్ ఫైట్ పై సర్వత్రా ఉత్కంఠ !
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠభరితంగా, క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది.
భారత్-న్యూజిలాండ్ జట్లు తుది పోరుకు సిద్ధమవుతున్నాయి. హోరాహోరీగా సాగనున్న మెగా ఫైనల్ ఫైల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. ఈ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 కి ప్రారంభం కానుంది వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో టీమిండియా ఐదోసారి అడుగుపెట్టింది. టీమిండియా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్స్‌లో ఆడగా రెండు సార్లు టైటిల్‌తో స్వదేశానికి తిరిగొచ్చింది. దుబాయ్ వేదిక ఇప్పుడు ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో తలపడనుంది.
మరోవైపు సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. అయితే, ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ – న్యూజిలాండ్ తలపడటం ఇది మూడోసారి. గత రెండు ఫైనల్స్‌లోనూ కివీస్ భారత్‌పై గెలిచింది.
2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఛాంపియన్‌గా నిలిచింది. ఇక నేడు జరగనున్న ఫైనల్లో గెలిచి ఐసీసీ టోర్నమెంట్ లో భారత్ పై హ్యాట్రిక్ విన్ సాధించాలని కివీస్ భావిస్తొంది.
అయితే, బలాబలాల పరంగా, ఫామ్ రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తుండడంతో… రేపటి మ్యాచ్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఫైనల్ మ్యాచ్ కు పిచ్ రెడీ !
ఫైనల్ కోసం లీగ్ స్టేజ్ లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ నే సిద్ధం చేసినట్లు తెలిసింది. ఫైనల్ కోసం లీగ్ స్టేజ్ లో జరిగిన భారత్ పాక్ మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ ను ఉపయోగించనున్నారు. ఈ పిచ్ స్పిన్నర్లుకు అనుకూలంగానే ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ రిపోర్టుల ప్రకారం.. ఈ గ్రౌండ్ స్లోగా ఉంటుందని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు తక్కువ. భారత తన అన్ని మ్యాచ్ లను ఇక్కడే ఆడింది. ఇంతకుముందు, ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 241 రన్స్ చేసింది. ఇండియా 244 రన్స్ చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాడు.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, .
న్యూజిలాండ్ జట్టు : మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.