ఏపీఎల్‌లో నేడు లీగ్ దశకు తెర

  • మంగళగిరిలో డబుల్ హెడర్‌తో ప్లేఆఫ్స్ రేసు తేలే రోజు
  • మధ్యాహ్నం సింహాద్రి వైజాగ్ లయన్స్–తుంగభద్ర వారియర్స్ తొలి పోరు
  • రాత్రి క్యాపిటల్ అమరావతి రాయల్స్‌తో రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఢీ
  • ప్లేఆఫ్స్ సమీకరణాలపై నేటి మ్యాచ్‌ల ఫలితాలే కీలకం
  • ఏసీఏ మంగళగిరి స్టేడియానికి భారీగా తరలివస్తున్న క్రికెట్ అభిమానులు
  • రోజురోజుకూ పెరుగుతున్న ఏపీఎల్ క్రేజ్‌తో స్టేడియంలో సందడి

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్–5లో లీగ్ దశకు నేడు తెరపడనుంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా డే–4లో రెండు కీలక లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్ సమీకరణాలను ప్రభావితం చేసే ఈ మ్యాచ్‌లపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

మధ్యాహ్నం 2 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు అంచనా వేస్తున్నారు.

రాత్రి 7 గంటలకు జరిగే రెండో మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు పూర్తి స్థాయి పోరాటంతో బరిలోకి దిగనున్నాయి.

ఏపీఎల్ సీజన్-5కు రోజురోజుకూ అభిమానుల ఆదరణ పెరుగుతుండగా, మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. స్టేడియం వద్ద అభిమానుల సందడి, టికెట్ల కోసం క్యూలు ఏపీఎల్‌కు లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.