ఖానాపూర్‌లో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖానాపూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జి. నగేష్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి శనివారం ఖానాపూర్ నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శాంతినగర్‌లో బొద్దోని కుంట పునరుద్ధరణ, నచ్చని ఎల్లాపూర్–సారంగాపూర్ రహదారి నిర్మాణం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు సత్యం, తహసీల్దార్ సుజాత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
