భారత్ జట్టులో కుర్రాళ్ల‌కు ఎంట్రీ..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌లో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఇద్దరు యువ ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్, ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నారు.

తొలి టీ20లో ఓటమి తర్వాత జట్టులో మార్పులు చేసిన భారత్.. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచింది. దేశీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.