Municipal Elections l మోత్కూర్ కి ఎంపీ చామల, ఎమ్మెల్యే సామెల్ రాక..

Municipal Elections l మోత్కూర్ కి ఎంపీ చామల, ఎమ్మెల్యే సామెల్ రాక..

Municipal Elections, మోత్కూర్,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ లు రానున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్ విలేకరులకు తెలిపారు.

నేడు ఉదయం 11 :30 ని.ల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల కో ఆర్డినేటర్లతో ఎన్నికల ప్రచారం, పోలింగ్, తదితర అంశాల పై 12 వార్డులకు సంబంధించి వార్డుల వారీగా సమీక్ష చేయనున్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు 11 మంది కాంగ్రెస్, సీపీఐ 1 కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అభ్యర్థులకు, నాయకులకు ఎంపీ చామల దిశానిర్దేశం చేయనున్నారు.