సర్టిఫికెట్ రద్దు సంచలనం..
సర్టిఫికెట్ రద్దు సంచలనం..
బాపట్ల వైపు దేశ దృష్టి..
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లాలో ఎస్సీ సర్టిఫికెట్ రద్దు వ్యవహారం సంచలనం రేపింది. పాస్టర్ చింతాడ ఆనంద్‌కు సంబంధించిన ఎస్సీ సర్టిఫికెట్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రద్దు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కలెక్టర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీ హోదా కోసం పాస్టర్ ఆనంద్ న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఫిర్యాదుదారుడు అక్కల రామిరెడ్డి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి వేధించారని ఆరోపించారు. న్యాయపోరాటం చేసి గెలిచానని తెలిపారు.
కలెక్టర్ వినోద్ కుమార్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
