పేకాట స్థావరంపై పోలీసులు దాడి…
పేకాట స్థావరంపై పోలీసులు దాడి…
నాదెండ్ల, ఆంధ్రప్రభ : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మండలంలోని చిరుమామిళ్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ట్రైన్ ఐపీఎస్ జాదవరపు నిరంజన్ మహేంద్ర సిన్హా తెలిపిన వివరాలు ప్రకారం చిరుమామిళ్ల గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న 21,590/- స్వాధీనం చేసుకొని వారిని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సోమవారం వీరిని కోర్టులో హాజరు పర్సనల్ ఉన్నట్లు నిరంజన్ మహేందర్ సిన్హా తెలిపారు.
ఈ సందర్భంగా మహేందర్ సిన్హా మాట్లాడుతూ మండలంలో ఎవరైనా పేకాట ఆడుతున్న గంజాయి మారకద్రవ్యాలు విక్రయిస్తున్న అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
