Cricket | భారత్ బిగ్ స్కోర్‌

Cricket | భారత్ బిగ్ స్కోర్‌

564/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్

Cricket | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌తో న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను 564 పరుగుల వద్ద 8 వికెట్ల నష్టానికి డిక్లేర్‌ చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో కెఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో మెరిశారు. కెఎల్‌ రాహుల్‌ 100 పరుగులు చేయగా, శుభ్‌మన్‌ గిల్‌ 126 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. రిషభ్‌ పంత్ 81 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌ స్కోరును 550 పరుగుల మార్క్‌ దాటించాడు. అంతకుముందు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 368/3 వద్ద నిలిచింది. గిల్‌, రాహుల్‌ సెంచరీలు, సాయి సుదర్శన్‌ 81 పరుగులు భారత్‌కు పటిష్ఠ పునాది వేశాయి.

Leave a Reply