Bail | ఎన్ఐఏ కేసులో మధ్యంతర బెయిల్
Bail | ఎన్ఐఏ కేసులో మధ్యంతర బెయిల్
Bail | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మావోయిస్టు నేత, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2025 డిసెంబరులో గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి వెళ్లిన అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరైన సందర్భంగా, మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై యూఏపీఏ (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది.
