పాఠశాలలు తెరుచుకునేలోపే పూర్తి సన్నాహాలు..

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు శనివారం మండలానికి చేరుకున్నాయని మండల విద్యా వనరుల అధికారి (ఎంఈవో) ఎన్. ఆంధ్రయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోందని చెప్పారు.

1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం 13,310 పాఠ్యపుస్తకాలు, 18,800 నోట్‌బుక్స్‌ను ప్రత్యేక వాహనంలో మండల విద్యా వనరుల కేంద్రానికి తరలించి నిల్వ ఉంచినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో అవసరమైన అన్ని పుస్తకాలు ఉండేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసినట్లు ఎన్. ఆంధ్రయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు బి. అంజయ్య, పి. అంజయ్య, రాజేష్, లలిత, రతన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply