సెన్సస్ స్వీయ గణనపై మున్సిపల్ ఉద్యోగులకు అవగాహన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం చేపట్టిన స్వీయ గణన కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాల్గొని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని, చౌటుప్పల్ పుర ప్రజలు, బంధుమిత్రుల కుటుంబ వివరాలు నమోదు చేయడంలో సహాయపడాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయం (పాత భవనం) లోని మీటింగ్ హాలులో శనివారం మున్సిపల్ సెక్షన్ అధికారులు, రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్, మెప్మా సిబ్బంది, బిఎల్ ఓ లతో సెన్సస్ స్వీయ గణన కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ రామిరెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ పుర ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. జనగణన 2027లో భాగంగా ప్రజలు తమ ఇంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. స్వీయ గణన ఈనెల 26 నుండి మే 10వ వరకు ప్రజలు se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకొని, తమ మొబైల్‌కు వచ్చే “ఎస్ఈ ఐడి నెంబర్ ” ని భద్రపరుచుకోవాలని, మే 11 నుండి జూన్ 10 వరకు ఇండ్ల గణన నిమిత్తం తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు పైన పేర్కొన్న వివరాలను సమర్పించాలని, ప్రజలందరూ ఈ ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొని సహకరించాలని కమిషనర్ వెంకటరామిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply