ఒత్తిడి లేని విద్య – నమ్మకమే పునాది

ఒత్తిడి లేని విద్య – నమ్మకమే పునాది

  • ఫిన్లాండ్ విద్యా విధానంపై ఉపాధ్యాయురాలు మమత అధ్యయనం

చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫిన్లాండ్ (ఫిన్నిష్) విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళిన ఉన్నత స్థాయి బృందంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు సాదు మమత చోటు సంపాదించుకోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పర్యటన ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన ఆమెను జిల్లా అధికారులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.

ఫిన్లాండ్ దేశంలో 98 శాతం ప్రభుత్వ పాఠశాలలే ఉండటం, కేవలం 2 శాతం మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు ఉండటం అక్కడి విద్యా వ్యవస్థ ప్రత్యేకత. విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా, కేవలం నమ్మకం, విశ్వాసం పునాదిగా సాగే ఈ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేసే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, కలెక్టర్లు రిజ్వాన్ పాషా, స్నిగ్ధ, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేష్ నేతృత్వంలో 40 మంది టీచర్లు, లెక్చరర్లు, అధికారులతో కూడిన బృందం ఫిన్లాండ్‌లో పర్యటించింది. ఈ బృందంలో ఉపాధ్యాయురాలు మమత ఉండి, అక్కడి బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణపై లోతైన అధ్యయనం చేశారు.

Leave a Reply