ప్రైవేట్ వెంచర్‌లో కారు వదిలేసి పరారైన దొంగల ముఠా
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లాలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటీఎంలో దొంగతనం చేసిన దొంగల ముఠా హైదరాబాద్ వైపు వస్తున్నారన్న సమాచారం అందడంతో చిట్యాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు.

పోలీసుల తనిఖీలను గమనించిన దొంగల ముఠా, తమ కారు (AP40 FL 0512)ను చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
