killed | daughter | కూతురునే చంపేశారు!

killed | daughter | కూతురునే చంపేశారు!
killed | daughter | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆడపిల్ల ప్రకృతితో సమానం.. ఇంట్లో ఆడ పిల్ల తిరిగితే లక్ష్మీదేవి తిరుగుతుందంటారు.. అలాంటి ఆడపిల్లను పరువు కోసం ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. మానవత్వం తలదించుకునేలా కొంత మంది కసాయిగా మారుతున్నారు. కూతురు కంటే పరువు ముఖ్యమని అనే భావించి ఓ తల్లిదండ్రులు కుమార్తెను హతమార్చి… ఆరోగ్యం బాగోలేదని చిత్రీకరించారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యహరించి నిజాలు బయట పెట్టారు. నేరం చేసేవాడు ఎప్పటికైనా దొరికిపోతాడు అనేది ప్రతిఒక్కరూ గమనించాలి. నెల రోజుల కిందట జరిగిన ఓ హత్యను లోతుగా దర్యాప్తు చేసి పరువు హత్య అని నిర్ధారించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.
killed | daughter | ఇదీ అసలు కథ!
సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట పంచాయతీ పరిధి శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి అర్చన (16) ఇంటర్మీడియట్ విద్యార్థిని నవంబర్ 15న మృతి చెందింది. అర్చనకు థైరాయిడ్, కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం ఉన్నట్టు పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో పరువు హత్య అని నిర్ధారణ అయిందని హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు.
వాటి వివరాలను వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన పోల్ అనిల్ (27)తో ప్రేమ పేరుతో తిరుగుతుందని, ఇట్టి విషయంపై తల్లిదండ్రులు అర్చనను వేధింపులు చేసినట్లు- ఆరోపణలు వచ్చాయి. కుటు-ంబం పరువు పోతుందని మృతురాలి తల్లిదండ్రులు రెడ్డి రాజు, రెడ్డి లావణ్యలు ముందస్తు పథకం ప్రకారం అర్చనతో పురుగుల మందును బలవంతంగా తాగించి అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. నిందితులు విచారణలో నేరం చేసిన విధానాన్ని, పథకాన్ని వారు అంగీకరించారని ఏసీపీ తెలిపారు. లభించిన ఆధారాల మేరకు మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు చెప్పారు.
