Rs 5 Lakh Baby : అంగట్లో పసిగుడ్లు Andhra Prabha Top Story

Rs 5 Lakh Baby : అంగట్లో పసిగుడ్లు Andhra Prabha Top Story

  • ఆసుపత్రిలో..అమ్మకం
  • మగ శిశువుకు రూ.5లక్షలు
  • ఆడ బిడ్డకు రూ.3 లక్షలు
  • మెతుకు సీమలో దత్తత దందా
  • ప్రైవేట్ ఆసుపత్రులే శిశు విక్రయ కేంద్రాలు
  • దళారులదే పసి పంట
  • సంతాన లేమి ఆసరాగా వ్యాపారం
  • పేద దంపతులే టార్గెట్
  • మెదక్ జిల్లాలో కలకలం

( మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ )

Rs 5 Lakh Baby

పొత్తిళ్ళలో సేదతీరాల్సిన పసి పిల్లలను అంగట్లో సరుకులుగా మార్చేస్తున్నారు. నవమాసాలు మోసి కంటికిరెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కన్నపేగును అమ్మకానికి పెడుతున్నారు. పేదరికం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత, అవగాహన లేమి, అధిక సంతానం, పోషణ భారం, కాసుల కక్కుర్తి వంటి నిస్సహాయతలను ఆసరగా చేసుకుని కొందరు దళారులు దత్తత పేరిట అక్రమ వ్యాపారానికి తెరలేపారు. పేదలను టార్గెట్ గా చేసి సంతానలేమి దంపతులకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆడ శిశువుకు ఓ రేట్, మగ శిశువుకు ఓ రేటు చొప్పున వెలకడుతూ
అమ్మ స్పర్శను గుర్తుపట్టే లోపే అప్పగింతలు కానిచ్చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్జన కోసం దళారీ వ్యవస్థ చాప కింద నీరులా విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది. పిల్లలతో వ్యాపారం చేసే ముఠాలు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ కేంద్రాలుగా బలపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో నవజాత శిశువు విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏటా పదుల సంఖ్యలో శిశు విక్రయ ఘటనలు బయటకు వస్తుండగా, బయటకు రానివి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లాలో చోటుచేసుకుంటున్న అమానవీయ ఘటనల పై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం..

Rs 5 Lakh Baby మెతుకు సీమలో కలకలం

Rs 5 Lakh Baby

మెదక్ జిల్లాలో వరుస శిశు విక్రయ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో గత మూడున్నరేళ్లలో మొత్తం 31 శిశు విక్రయ ఘటనలు అధికారిక లెక్కల ప్రకారం వెలుగులోకి వచ్చాయి. ఇందులో మొత్తం 24 మంది ఆడ, 7 మంది మగ శిశువుల విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో 7 సంఘటనలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. 2023లో 03 శిశు విక్రయాలు జరిగితే అందులో 2 ఆడ, 1 మగ శిశువు ఉండగా, ఒక్కటి ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే 2024లో 11 శిశు విక్రయాలు జరుగగా 9 మంది ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉండగా, ఎవరి పై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. 2025లో 10 శిశు విక్రయాలు జరుగగా, అందులో 07 ఆడ, 3 మగ శిశువులు ఉండగా, 3 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. 2026లో ఇప్పటి (ఏప్రిల్,మే) వరకు మొత్తం 07 శిశు విక్రయ ఘటనలు చోటుచేసుకోగా, అందులో 6 ఆడ, ఒక మగ శిశువు ఉండగా, 3 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, హవేలిఘనపూర్, నిజాంపేట్, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగ్, కొల్చారం, తదితర మండలాల్లో ఎక్కువగా శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది.

Rs 5 Lakh Baby పేద దంపతులే టార్గెట్​

Rs 5 Lakh Baby

పేదరికంతో బాధపడుతున్న తల్లిదండ్రులను ప్రలోభపెట్టి మధ్య దళారులు మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సంతాన లేమిని ఆసరా చేసుకుని ముఠాలు అక్రమ దందాకు తెరలేపారు. పిల్లలు లేని నిస్సహాయ దంపతులకు దత్తత పేరిట అక్రమంగా పిల్లలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మగ శిశువుకు రూ. 5 లక్షలు, ఆడ శిశువుకు రూ. 3 లక్షల చొప్పున వెలకడుతూ బేరసారాలు సాగిస్తున్నారు. అక్షరాస్యత, అవగాహన లేని, మద్యానికి బానిసలైన పేద కుటుంబాలకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎక్కువ మొత్తంలో దళారులు పంచుకుంటున్నట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ శిశు విక్రయ ఘటనల్లో మెదక్ తో పాటు సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు దళారులు చైన్ సిస్టంగా వ్యాపారం సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలను తల్లులకు తెలియకుండా అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

Rs 5 Lakh Baby తీగ దొరికిందోచ్​..

Rs 5 Lakh Baby

అధిక సంతానంతో పోషణ భారంగా మారిన తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయించిన ఘటనలో 10 మంది పై మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన శిరీష- దేవిసింగ్ దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా, నాలుగో ప్రసవం కోసం మార్చి 27న మెదక్ పట్టణంలోని ఎంసిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన శిరీష్ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలను పోషించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ శిశువును విక్రయించేందుకు నిర్ణయించుకొని ఆర్మూర్ కు చెందిన శారదను సంప్రదించారు. కొల్చారం మండలం చిన్నఘనపూర్ తండాకు చెందిన గుగ్లోత్ సోనీ, వెల్దుర్తి మండలం మంగళపర్తికి చెందిన ధర్మసోత రాజు, మెదక్ మండలం సంగాయగూడ తండాకు చెందిన ఇస్లావత్ ప్రేమిలా, హవేలిఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన మహేందర్, నిజామాబాద్ జిల్లా కొండాపూర్ మండలం మూడ్ మామిడిభాను తండాకు చెందిన భాస్కర్ ల మధ్యవర్తుల సహకారంతో సిద్దిపేట జిల్లా కొత్వాల్ మండలం అల్లినగర్ గ్రామానికి చెందిన బొమ్మ లింగయ్య – కమలమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శిశువును రూ.3 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 1న మెదక్ పట్టణంలోని పిల్లికోటల్ వద్ద మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. అయితే ఆర్మూర్ కు చెందిన శారద శిశువు తల్లిదండ్రులకు కేవలం రూ.40 వేలు, మిగతా మధ్యవర్తులకు రూ.10 వేల చొప్పున ఇచ్చి మిగతావి తాను తీసుకున్నట్లు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వివరాలు సేకరించి శిశువును స్వాధీనం చేసుకొని సంగారెడ్డి శిశుగృహకు అప్పగించారు.

Rs 5 Lakh Baby : హెల్త్ కేర్ ఆసుపత్రిలో …

Rs 5 Lakh Baby

ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆసుపత్రికెళ్తే .. పుట్టిన బిడ్డను అక్కడ పని చేసే నర్స్ రూ. 1.50 లక్షలకు విక్రయించిన అమానవీయ ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. మెదక్ పట్టణంలోని హెల్త్ కేర్ ఆసుపత్రిలో ఏప్రిల్ 12న చేరిన నస్రా ఫాతిమా అనే గర్భిణీకి 13న ఉదయం 12.00 గంటలకు సిజేరియన్ చేయగా 2.4 కేజీల బరువు ఉన్న ఆడ శిశువు జన్మించింది. అక్కడ నర్స్ గా పనిచేసే అక్తరి బేగం ముందస్తు పథకం ప్రకారం పుట్టిన శిశువును చిన్న పిల్లల వైద్యుడు వద్దకు తీసుకెళ్తున్నట్లు చెప్పి స్థానిక గోల్కొండ వీధికి చెందిన నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్) అనే వ్యక్తి సహకారంతో సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, నదీయ సుల్తానా దంపతులకు రూ.1,50,000లకు విక్రయించారు. అలా వచ్చిన డబ్బులో నుంచి మధ్యవర్తిగా ఉన్న నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్) కు రూ.10వేలను ఇచ్చి మిగతా రూ.1,40,000 తాను తీసుకున్నట్లు తెలిసింది. ప్రసవంలో బిడ్డ చనిపోయిందని తల్లికి చెప్పి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ వారం తర్వాత అసలు విషయం తెలియడంతో బాధిత కుటుంబం బయటకు రావడంతో బాధితులు మే 3న పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి నర్స్ అక్తరి బేగం, మధ్యవర్తి నౌసిన్ ఉన్నిసా (నిలోఫర్), శిశువును కొనుగోలుచేసిన సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, నదీయ సుల్తానాలను అరెస్ట్ చేసు రిమాండ్ కు తరలించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ ఆసుపత్రిని సీజ్ చేసినా.. 24 గంటలు గడవకుండానే రాజకీయ ప్రోత్బలంతో హాస్పిటల్ తెరుచుకోవడం గమనార్హం.

Rs 5 Lakh Baby : మద్యానికి బానిసై

హవేలీఘనపూర్ మండలం లింగ్సాన్ పల్లి తండాకు చెందిన మంజుల ఫిబ్రవరి 10న మెదక్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మద్యానికి బానిసైన తల్లిదండ్రులు పది రోజుల పసి కందును రూ.5 లక్షలకు అమ్మేందుకు బేరం పెట్టారు. మెదక్ పట్టణంలోని మధ్యవర్తుల సహాయంతో కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన పిల్లలు లేని రజిత – రాజు అనే దంపతులకు మార్చి 4న రూ.1.70 లక్షలకు విక్రయించారు. అంగన్వాడి టీచర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి శిశువు స్వాధీనం చేసుకొని శిశు గృహాకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Rs 5 Lakh Baby : అమ్మడం కొనడం నేరం

Rs 5 Lakh Baby

పిల్లలను అమ్మడం కొనడం చట్టరీత్య నేరంగా పరిగణించబడుతుంది. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేని తల్లిదండ్రులను కొందరు దళారులు ప్రలోభపెట్టి తమ పిల్లలను దత్తత పేరిట అక్రమంగా విక్రయిస్తున్నారు. సంతానం లేని దంపతులను ఎంపిక చేసుకొని శిశువులను విక్రయిస్తున్నారు. పిల్లలను అమ్మిన వారు, కొన్నవారితో పాటు మధ్యవర్తుల పైన పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. పిల్లల క్రయవిక్రయాలు జరిపితే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 1091 లేదా 100 కు, 1098 చైల్డ్ లైన్.నంబర్ కు డయల్ చేసి సమాచారం అందించాలి.

హేమభార్గవి, మెదక్​ జిల్లా మహిళా సంక్షేమాదికారి

  • మెదక్ జిల్లాలో శిశు విక్రయాలు
    ఏడాది కేసులు ఆడ మగ
    2023 03 2 1
    2024 11 9 2
    2025 1 0 7 3
    2026 07 6 1
  • మొత్తం 31 24 7

ALSO READ : Bandi Sanjay : సన్ స్ట్రోక్.. Andhra Prabha Top Story

Leave a Reply