ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టులు

భారాస బస్ భవన్ ముట్టడిని కట్టడి చేస్తున్న పోలీసులు…


(ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో ఆంధ్రప్రభ) : పెంచిన బాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారాస చేపట్టిన బస్ భవన్ (bus bhavan) ముట్టడిని పోలీసులు అడుగడుగునా కట్టడి చేస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ను హౌస్ అరెస్టు చేసారు.

శ్రీనగర్ కాలనీలోని మాజీ మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) నివాసం వద్ద పోలీసులు మోహరించారు. అక్కడి నుంచి తప్పించుకుని బస్ భవన్ చేరుకునేందుకు మాజీ మంత్రి సబితారెడ్డి, భారాస నేతలు ప్రయత్నించగా, చే నంబర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోని తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి , ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులను అంబర్ పేటలో అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు. జిల్లాల నుండి హైదరాబాద్ కు భారాస నేతలు రాకుండా లోకల్ పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసిన తరువాతే వదిలిపెడుతున్నారు.

Leave a Reply