BREAKING NEWS | చర్చలు సఫలం..

  • రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు పునఃప్రారంభం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల నిరవధిక బంద్‌ సమస్యకు పరిష్కారం లభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి.

ప్రైవేట్ కాలేజీల డిమాండ్లను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో చర్చలు సానుకూలంగా ముగిశాయి.

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు రూ.1,500 కోట్ల బకాయిల చెల్లింపులు కోరగా, ప్రభుత్వం దశలవారీగా పెండింగ్ బిల్లులను చెల్లించాలని నిర్ణయించింది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేసిందని, మరో రూ.600 కోట్లు త్వరితగతిన విడుదల చేస్తామని, మిగిలిన రూ.300 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ఆయన ప్రకటించారు.

అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం హామీలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. దీంతో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి.

Leave a Reply