ప్రజాసేవకే అంకితమైన అర్థ వెంకట్ రెడ్డి..

ప్రజాసేవకే అంకితమైన అర్థ వెంకట్ రెడ్డి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజా సేవకు అంకితమైన కాంగ్రెస్ యువ నాయకుడు అర్థ వెంకట్ రెడ్డి – పల్లవి దంపతుల వివాహ వార్షికోత్సవం వేడుకలను అల్లాపురం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిని పంపిణీ చేశారు. ప్రజా సేవే లక్ష్యంగా అనునిత్యం ప్రజల్లో ఉంటూ అందరిలో ఒక్కడిగా కలిసిపోతూ నాయకత్వం అంటే సేవ అని నిరూపిస్తున్న యువ నాయకులు అర్థ వెంకట్ రెడ్డి అన్నారు.

ఈ దంపతులు కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇలాంటి వివాహ వార్షికోత్సవాలను సరళ మైసమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో ఆనందంగా మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో రాజకీయాలలో ఉత్తమమైన పదవులను పొంది ఇంకా ఎక్కువ సేవలు అందించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.