Husband and wife | దంపతులు అక్కడికక్కడే..

Husband and wife | దంపతులు అక్కడికక్కడే..
Husband and wife | పాలకుర్తి, ఆంధ్రప్రభ: జీవితంలో ప్రతి అడుగూ కలిసి వేసిన ఆ ఇద్దరి ప్రయాణం.. చివరి క్షణంలో కూడా విడిపోలేదు. హైదరాబాద్ నుంచి తమ స్వస్థలం మంచిర్యాలకు వెళ్తున్న ఎడ్ల శ్రీనివాస్ (43), రజిత (42) దంపతులు మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ బస్టాండ్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఒకే ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ప్రమాదంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కలిసి జీవించిన ఆ దంపతుల చివరి ప్రయాణం విషాదంగా ముగియడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
