apartment | ఆర్సీపురంలో విషాద ఘటన
apartment | ఆర్సీపురంలో విషాద ఘటన
apartment |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతిచెందాడు. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్‌లో విషాద వాతావరణం నెలకొంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేంకటేశ్వర్లు కుటుంబంతో కలిసి రామచంద్రారెడ్డి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఆడుకోవడానికి వెళ్లిన అతని కుమారుడు గిరిధర్ ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.
లిఫ్ట్ నుంచి భారీ శబ్దం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని బయటకు తీశారు. అప్పటికే బాలుడు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
