ఎఫ్ఆర్ఓగా బాధ్యతల స్వీకరణ

ఎఫ్ఆర్ఓగా బాధ్యతల స్వీకరణ

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్(Tiger Reserve)లోని జన్నారం ఫారెస్ట్ రేంజు ఆఫీసరు(ఎఫ్ఆర్ఓ)గా లక్ష్మీనారాయణ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్(Deputy Range Officer) మమత ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరుగా వ్యవహరించారు.

గతంలో ఇక్కడ కొంతకాలం ఎఫ్ఆర్ఓగా పనిచేసిన లక్ష్మీనారాయణ రెండుసార్లు సెలవుపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.

Leave a Reply