AP | నలుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..

AP | నలుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీసత్యసాయి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నివాస గృహంలో గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో నలుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply