21st Chief Minister | బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రి..
21st Chief Minister | బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రి..
21st Chief Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బీహార్ రాజకీయ చరిత్రలో ఇవాళ కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ పరిణామంతో బీహార్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగిన నితీష్ కుమార్ శకానికి తెరపడింది. మరోవైపు, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తొలి నాయకుడిగా సామ్రాట్ చౌదరి చరిత్ర సృష్టించారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం
సామ్రాట్ చౌదరితో పాటు జేడీయూ (JD-U) ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌లు కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారంతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం మరింత పెరిగింది. ప్రస్తుతం దేశంలో బీజేపీకి 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ సంకీర్ణ లేదా సొంత ప్రభుత్వాలను నడుపుతోంది. బీజేపీ చరిత్రలో చౌదరి 57వ ముఖ్యమంత్రిగా నిలిచారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కీలక హిందీ రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీకి, బీహార్‌లో సొంత ముఖ్యమంత్రి పీఠం దక్కడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలం పాటు బీహార్ రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్, మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
