కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్
ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా ఆలయంలోకి ఆహ్వానించారు. మంత్రి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. శీనా నాయక్ దగ్గరుండి మంత్రి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించగా, దేవస్థానం తరఫున అమ్మవారి శేషవస్త్రం చిత్రపటం ప్రసాదాలను ఈవో సేన నాయక్ మంత్రికి సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, అర్చకులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.

