IPL Final | బెంగళూర్ vs గుజరాత్

IPL Final | బెంగళూర్ vs గుజరాత్
IPL Final | మ్యాచ్: IPL 2026 ఫైనల్
జట్లు: బెంగళూర్ vs గుజరాత్
వేదిక: నరేంద్రమోదీ స్టేడియం
తేదీ: 31 మే 2026
టాస్: సాయంత్రం 7:00 గంటలకు
మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7:30 గంటలకు (IST)
ప్రత్యక్ష ప్రసారం : స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్
IPL Final | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 చివరి ఘట్టం రానే వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు చెరోసారి ఛాంపియన్‌గా నిలిచాయి. దాంతో ఎవరు గెలిచినా రెండోసారి టైటిల్ అందుకోవడం ఖాయం. ఈ హై-వోల్టేజ్ పోరు నరేంద్రమోడీ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది.ఈ సీజన్‌లో ఇరు జట్లు మూడు మ్యాచ్‌లలో ఆడితే.. లీగ్‌లో చెరొక మ్యాచ్‌లో విజయం సాధించగా, క్వాలిఫయర్ 1లో గుజరాత్ ఓటమిపాలయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఫైనల్‌కు జట్ల ప్రయాణం
RCB లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి, క్వాలిఫయర్-1లో GTపై 92 పరుగుల భారీ విజయం సాధించి నేరుగా ఫైనల్ చేరింది.
GT క్వాలిఫయర్-1లో ఓడినా, క్వాలిఫయర్-2లో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. 2025లో ఛాంపియన్‌గా అవతరించింది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్‌గా మిగిలింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచింది. 2002లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అదే ఏడాది హార్దిక్ పాండ్యా ఛాంపియన్‌గా నిలపగా.. 2023లో మళ్లీ ఫైనల్‌కు వెళ్లి ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు మూడో సారి ఫైనల్ బరిలో నిలిచింది.
ఈ ఐపీఎల్‌లో లీగ్ స్టేజ్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. క్వాలిఫయర్ 1లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగానే జరగనుండటంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.
వర్షం అంతరాయం కలిగిస్తే?
బీసీసీఐ ఫైనల్‌కు రిజర్వ్ డే (జూన్ 1)ను కేటాయించింది. వర్షం కారణంగా ఇవాళ మ్యాచ్ పూర్తిగా జరగకపోతే, పోటీని రిజర్వ్ డేకు మార్చుతారు. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ నిర్వహించడం సాధ్యంకాకపోతే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆ ప్రయోజనం RCBకి ఉంది.
CLICK HERE TO READ BCCI | గిల్, సూర్యలను పక్కన పెట్టేశారు…
