Mahesh Babu | మహేశ్ బాబు భావోద్వేగ పోస్టు

Mahesh Babu | మహేశ్ బాబు భావోద్వేగ పోస్టు

Mahesh Babu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు భావోద్వేగ పోస్టుతో అభిమానులను ఆకట్టుకున్నారు. తండ్రిపై తనకున్న ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నేడు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో తండ్రిని స్మరించుకున్నారు. “Forever My Hero… Happy Birthday Nanna” అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానులను హృదయానికి హత్తుకునేలా చేసింది.

చిన్న సందేశమే అయినప్పటికీ, తండ్రిపై మహేశ్‌కు ఉన్న అపారమైన అనుబంధం, అభిమానాన్ని అది ప్రతిబింబిస్తోంది. కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని, తన జీవితంలో నిజమైన హీరో ఆయనేనని మహేశ్ బాబు ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంచలనాలకు నాంది పలికిన నటుడిగా చిరస్థాయిగా నిలిచారు. ఆయన జయంతి సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు చేసిన భావోద్వేగ పోస్టు అభిమానుల మనసులను మరింత కదిలిస్తోంది.

Leave a Reply