ap-investment : వసతులకు ఢోకాలేదు Andhra Prdesh Top News

ap-investment : వసతులకు ఢోకాలేదు Andhra Prdesh Top News

  • వ్యవసాయంలోనూ..
  • టెక్నాలజీలోనూ.. ఏపీ ఒక వనరు
  • పెట్టుబడులకు భయం లేదు
  • ప్రధాని మోదీ అండతో
  • బారత్​ అభివృద్ధి పథంలో.. వెళ్తోంది
  • భారత హై కమిషనర్ తో ఎపీ సీఎం భేటీ

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్)​

సింగపూర్‌లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ సోమవారం భేటీ అయ్యారు. భారతదేశంలో సింగపూర్‌కు ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను వివరించిన శిల్పక్ అంబులే వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.

ap-investment : ఏపీలో ,, వసతులు భేఫ్​

ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… షిప్ బిల్డింగ్‌కు, సివిల్ ఏవియేషన్‌లో ఎంఆర్‌వో కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయి ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నాం. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు. ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులు ఏపీలోని రైతులు పండిస్తున్నారు. హార్టికల్చర్ పంట ఉత్పత్తులు ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నాం. ఆహార రంగంలో ట్రేసబులిటీ స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సహకారం కోరుతున్నాం
సింగపూర్ టెక్ రంగ అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధంగా ఉంది. అని సీఎం చంద్రబాబు వివరించారు.

ap-investment : పెట్టుబడులకు భయం లేదు..

అభివృద్ది కార్యక్రమాలు, పెట్టుబడుల విషయంలో పొలిటికల్ సిస్టం, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు.పెట్టుబడులతోనే అభివృద్ది, సంపద సృష్టి, ఉద్యోగ, ఉపాధి సాధ్యం అవుతుంది. భారతదేశాన్నినెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడుల విషయంలో ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపికి వచ్చాయి. హిందూ గ్రోత్ రేట్ 1 నుంచి 2 శాతం మాత్రమేఅని ఒకప్పుడు హేళన చేసేవాళ్లు…ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ రంగంలో పెట్టుబడులకు అయినా భారతదేశం సిద్దంగా ఉంది. పాలసీలు, సాంకేతిక నిపుణులు, అవసరమైన ఎకో సిస్టంతో ప్రధాని దేశాన్ని పెట్టబడులకు సిద్దంగా ఉంచారు. సింగపూర్ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యానికి సీఎం విజ్ఞప్తి చేశారు.

ap-investment : పెట్టుబడులతో సహకరిస్తాం

ఈ సందర్భంగా అంబులే మాట్లాడుతూ…
గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్ ఎకో సిస్టంలో సింగపూర్ చాలా ముందు ఉంది
భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో సింగపూర్ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉంది.
ఎపిలో పెట్టుబడులకు అసవరమైన సహకారాన్ని అందిస్తాం, అని అంబులే హామీ ఇచ్చారు.