ap deputy cm | భద్రకాళి సన్నిధిలో పవన్ కళ్యాణ్
ap deputy cm | భద్రకాళి సన్నిధిలో పవన్ కళ్యాణ్
నిరంజన్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు
ap deputy cm | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తన అభిమానిగా చిన్ననాటి నుంచి ఆరాధిస్తున్న నిరంజన్ అనారోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలుడి ఆరోగ్యంపై ప్రార్థనలు చేశారు.

ముందుగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, బాలుడిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం భద్రకాళి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మానవత్వంతో స్పందించి నిరంజన్ ఆరోగ్యం కోసం ప్రార్థించడం అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు కూడా నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


