పేదల సొంతింటి కళను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…

పేదల సొంతింటి కళను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…
కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నిరుపేదల సొంతింటి కళను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమానీ కాంగ్రెస్ నల్లబెల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి గ్రామంలో నాతి సువర్ణ రాజేందర్ దంపతులు నూతనగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తినీ మహేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, పేదవాడి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో పరికి త్యాగరాజు , మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండి అశోక్,త్రికోవెల మురళి మాసంపల్లి ప్రభాకర్, బుస కుమారస్వామి,గాజు బిక్షపతి, నంగునూరు మళ్ల చారి, బాబురావు, పోడేటి కిషోర్, పాండవుల శంకర్ లింగం, కన్నెబోయిన సురేష్, రాజు, విష్ణు, పోడేటి కిరణ్, కోడూరి సిద్దు, యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ దండు సునీల్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
