Kho-Kho : అట్ట‌హాసంగా రాష్ర్ట‌స్థాయి ఖో-ఖో పోటీలు

గుడివాడ – ఆంధ్రప్రభ : విజయనగరంలో అండర్ -19 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలు (Andhra Pradesh State Level Kho-Kho Competitions) ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని తృతీయ స్థానం కైవసం చేసుకుని కంచు పతకం సాధించారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులలో డి.రాకేష్, ఎం. లక్ష్మీధర్ జనవరి నెలలో జబల్ పూర్, మధ్య ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ స్టేడియం ఖోఖో కోచ్ కుమారి కత్తి చైతన్య శిక్షణలో ఈ క్రీడాకారులు విజయాన్ని సాధించారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస రావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్ విజయం సాధించిన క్రీడాకారులను, శిక్షణ ఇచ్చిన కోచ్‌ను అభినందించారు. కృష్ణాజిల్లా ఖో-ఖో అధ్యక్షులు మడకా ప్రసాద్, కార్యదర్శి మద్దినేని సత్య ప్రసాద్ కూడా గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.

Leave a Reply