కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు…

కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు…

స్థానికులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పోలీస్ అధికారులు..
స్వాధీనం చేసుకున్న బైకులు…
26 బైకులు స్వాధీనం… ఒక కత్తి.

సత్తెనపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపూడి గ్రామంలో సత్తెనపల్లి డి.ఎస్.పి మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సత్తెనపల్లి రూరల్ స్టేషన్ సిఐ హైమారావు నేతృత్వంలో సుమారు 90 మంది పోలీసులు గ్రామంలో ప్రతి ఇంటిని నిశితంగా పరిశీలించారు. ఎటువంటి పత్రాలు లేని 26 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని సీఐ హైమారావు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి, ప్రయాణించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై స్థానికులకు, పోలీసుల అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. సత్తెనపల్లి రూరల్, ఎస్ అమీనుద్దెన్, పెదకూరపాడు సీఐ లు కిరణ్, పి. సురేష్, పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

Leave a Reply