మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి ఎల్‌వోసీ అందజేత

మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి ఎల్‌వోసీ అందజేత

భవానిపురం, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో రూ.3 లక్షల 15 వేల ఎల్‌వోసీ మంజూరైంది. ఈ పత్రాన్ని ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

52వ డివిజన్ మల్లికార్జునపేటకు చెందిన పి. వరలక్ష్మి (52) అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. దీంతో మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) ఎన్డీఏ కార్యాలయంలో ఎల్‌వోసీ కోసం దరఖాస్తు చేశారు.

మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేయగా, వారు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, గంజి పవన్, ఏలూరు సాయి శరత్, శనివారపు శివ, దాడి మురళీకృష్ణ, ఈగల సాంబశివరావు, నక్కెట్ల రాజా, శ్యామ్ మారేపల్లి, మలపరెడ్డి అప్పారావు, గాడు గణేష్, సీ హెచ్ రామనాయుడు, గూడూరు కొండయ్య, గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply