త్వరలో పెన్షన్ లపై ప్రభుత్వం కొత్త పాలసీ

త్వరలో పెన్షన్ లపై ప్రభుత్వం కొత్త పాలసీ

  • ఎంపీ కేసినేని శివనాథ్

భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కు ఎంపీ కేశినేని చిన్ని హాజరై ప్రజల నుండి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారుల తో మాట్లాడి సమస్యలపై వెంటనే స్పందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత మంత్రి లోకేష్ సూచనల మేరకే ప్రజా దర్బార్ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేసిన ప్రజలు అనేక సమస్యలతో ప్రజా దర్బార్ కు వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఇబ్బందుల వల్ల ప్రజలు ప్రజా దర్బార్ కు వస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే విజయవాడలో ఉన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు విజయవాడ పార్లమెంట్ లో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా కలిసి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యలు అన్నిటిపై సానుకూలంగా స్పందించి తగిన రీతిలో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.

అనేకమంది ప్రజలు పెన్షన్స్ పై సమస్యలు వచ్చాయని త్వరలోనే ప్రభుత్వం కొత్త పాలసీని పెన్షన్స్ పై తీసుకురానిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుగానే ఉంటుందని ఇది మీ అందరి ప్రభుత్వమని ప్రజలకు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అని ఒక్కొక్కటిగా అమలు చేశామని గత ప్రభుత్వంలో ఎవరు ప్రజల దగ్గరకు వెళ్ళిందే లేదని అన్నారు జీవో నెంబర్ 30ని త్వరలోనే తీసుకువచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని చిన్ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోఉమ్మడి కృష్ణ గ్రంథాలయ చైర్మన్ బేగ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, మార్కెటింగ్ ఉపాధ్యక్షులు పి మాధవ,పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆశ వాణిజ్య విభాగంజిల్లా అధ్యక్షుడు సోలంక రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply