స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం
స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం
పాయకాపురం, ఆంధ్రప్రభ: స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, మన వీధులు, కాలనీలు, డివిజన్లు, నియోజకవర్గం శుభ్రంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
